ఖిలావరంగల్, మార్చి 21: ఏఐ టూల్స్, డిజిటల్ వనరులను ఉపయోగించి విద్యార్థులు తమ వ్యాపార ఆలోచనలకు పదను పెట్టాలని డిజిటల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో నిఖిల్ అన్నారు. బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో కృత్రిమ మేథస్సును ఉపయోగించి డిజిటల్ వ్యవస్థాపకత అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించి శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ మోడల్ కాన్వాస్ వంటి విషయాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వంత స్టార్టప్ ప్రారంభిచాలన్న ఆత్మ విశ్వాసం విద్యార్థులకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆన్ ఈసీ, ఏఐ వ్యవస్థాపకుడు అభిషేక్, విగ్నాన్ ఫౌండేషన్ డాక్టర్ సురేష్‌చంద్ర, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే తిరుపతిరావు, డాక్టర్ వేణు, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ వై భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.