వైద్యం అందక నవజాత శిశువు మృతి
సమయానికి చికిత్స అందక నవజాత శిశువు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాపూర్ మండలంలోని రోలుబండ గోత్తికోయగూడేనికి చెందిన మడకం భీమా-బుద్ది దంపతులకు ఈ నెల 25న ఇంటి వద్ద ఆడ శిశువు జన్మించింది.
వెంకటాపూర్, ఫిబ్రవరి 28 : సమయానికి చికిత్స అందక నవజాత శిశువు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాపూర్ మండలంలోని రోలుబండ గోత్తికోయగూడేనికి చెందిన మడకం భీమా-బుద్ది దంపతులకు ఈ నెల 25న ఇంటి వద్ద ఆడ శిశువు జన్మించింది. నెలలు నిండక ముందే పుట్టడంతో శిశువు అనార్యోగానికి గురై చికిత్స అందక మరుసటి రోజు మృతిచెందింది. ఈ క్రమంలో 27న ఆమె ఆరోగ్యం కూడా క్షీణించడంతో చికిత్స కోసం భర్త భీమా సైకిల్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి మండలకేంద్రానికి తీసుకొచ్చాడు. తెలిసిన వారికి విషయం తెలుపగా వారు 108కు ఫోన్ చేసి ములుగు ఏరియా హాస్పిటల్కు తరలించారు. తాము ఉండే గ్రామంలో వైద్య సదుపా యం, రవాణా సౌకర్యం కల్పించాలని, నిత్యం అందుబాటులో డాక్టర్లు ఉండేలా చూడాలని, వైద్యం అందక చాలామంది చనిపోతున్నారని ఈ సందర్భంగా భీమా ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్, అధికారులు, ప్రభుత్వాన్ని కోరాడు.
మెరుగైన వైద్యం అందించండి
ఏరియా ఆసుపత్రిలో బుద్ధి చేరినట్లు తెలుసుకున్న డీఎంహెచ్వో అప్పయ్య ఆమెకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పీహెచ్సి వైద్యాధికారి శ్రీకాంత్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

