నర్సంపేట/నల్లబెల్లి/నెక్కొండ, ఏప్రిల్ 30: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదని కలెక్టర్ సత్యశారద అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. అనంత రం వారు మాట్లాడుతూ భూ భారతి చట్టం లో రైతుల సౌకర్యార్థం 23 సెక్షన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ చట్టంతో రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామాల్లో భూ సమస్యలుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సదస్సులో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు, ఏవో కృష్ణకుమార్, ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బొ బ్బాల రమణారెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు. నల్లబెల్లిలోని రైతు వేదికలో భూ భారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రకాల భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొస్తున్నదన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతే కాకుండా నెక్కొండలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరై రైతులకు అవగాహన కల్పించారు. సదస్సులో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి గోవిందరాజన్, తహసీల్దార్ రాజ్‌కుమార్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.