పోచమ్మమైదాన్, డిసెంబర్ 27: ఓరుగల్లుకు చెందిన నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచవ్యాప్తంగా వేలా ది మిమిక్రీ ప్రదర్శనలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. అందరినీ కడుపుబ్బ నవ్వి స్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూ ధ్వన్యనుకరణ సామ్రాట్ బిరుదు పొందాడు. ఆయన మనమధ్య లేకపోయి నా ఆయన తయారు చేసిన కళాకారులు ఎందరో ఉన్నారు. వేణుమాధవ్ 2018 జూన్ 19న వరంగల్‌లో కన్నుమూశారు. డిసెంబర్ 28న నేరెళ్ల వేణుమాధవ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు.
వరంగల్ మట్టెవాడలోని శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932, డిసెంబర్ 28న జన్మించారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకుంటూ ఇంగ్లిషు సినిమాలు చూసి, వాటిల్లో ఆర్టిస్టుల గొంతులు, ముఖ్య సన్నివేశాలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వినిపిస్తూ అందరినీ అలరించేవారు. తర్వాత హనుమకొండ, ధర్మసాగర్, మట్టెవాడ, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి, అనేక మిమిక్రీ ప్రదర్శనలతో విద్యార్థులను ఆకట్టుకు నేవారు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1947లో తొలి ప్రదర్శన ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. 1953లో రాజమండ్రిలో మలి ప్రదర్శన ద్వారా మిమిక్రీలో మరెంతో ఎదిగారు. 1957, ఫిబ్రవ రి 3న శోభావతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శ్రీనాథ్, రాధాకృష్ణ, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీతులసి, వాసంతి ఉ న్నారు. శోభావతి భర్త అడుగుజాడల్లో నడుస్తూ, వృ ద్ధాప్యాన్ని లెక్కచేయకుండా పలు సేవా కార్యక్రమా ల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆటో నగర్‌లోని అంధుల పాఠశాలను దత్తత తీసుకుని ప్రతి నెల ఉపాధ్యాయులకు రూ.10వేల వేత నం చెల్లించడంతో పాటు ఫస్ట్ ఫ్లోర్లో భవన నిర్మాణం, ఇతర వసతులు కల్పించారు.
1947 నుంచి మిమిక్రీ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టిన వేణుమాధవ్ అంచెలంచెలుగా ఎదుగు తూ అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. తెలంగాణలోని ఓరుగల్లు కీర్తి ప్రతిష్టతలను ఇనుమ డింపచేశారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ నలుదిశలా పేరు సంపాదించుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రదర్శన ఇచ్చి దేశానికి గురి్ంతపు తీసుకవచ్చారు. నేరెళ్ల వేణుమాధవ్ పేరుమీద హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ప్రత్యేకంగా క ళా ప్రాంగణా న్ని నిర్మించారు. విగ్రహాన్ని సైతం ప్రతిష్టించారు. నేరెళ్ల వేణుమాధవ్ 1972 నుం చి 1078 వరకు ఎమ్మెల్సీగా, 1972 నుంచి 19 75 వరకు ఏపీ లెజిస్లేటివ్ కమిటీ సభ్యుడిగా, 1974 నుంచి1978 వరకు సం గీత నాటక అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. పలు యూనివర్సిటీల నుంచి అవార్డులు, డాక్టరేట్లు అం దుకున్నారు. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కా రం, 2015లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అనేక బిరుదులు సంపాదించుకున్నారు.
వేణుమాధవ్ 93వ జయంతి సందర్భంగా శనివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల ప్రాం గణంలో సాయంత్రం 5 గంటలకు స్వరార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు మిమిక్రీ చేయనున్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అధ్యక్ష తన జరిగే కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, స్థానిక మిమిక్రీ ఆర్టిస్టులు పాల్గొంటారు.
తోటి కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కళాకారుడిని ఎంపిక చేసి వారికి రూ. పదివేలు అందజేసి, పురస్కారంతో సత్కరిస్తారు. ఈ సంవత్సరం ఆయన ప్రియ శి ష్యుడు కేసముద్రానికి చెందిన మిమిక్రీ శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. కాగా శ్రీనివాస్ అంతర్జాతీ య ఖ్యాతిగాంచిన వెంట్రిలాక్విస్టు, మిమిక్రీ కళాకారుడు. భారతదేశంలో తొలి ధ్వని ఇంద్రజాలి కుడు.