వర్ధన్నపేట, డిసెంబర్ 30 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో గ్రామాల వారీగా జరుగుతున్న, చేపట్టాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. వీటితో పాటుగా ఎస్సీ నియోజకవర్గమైన వర్ధన్నపేటకు సీఎం కేసీఆర్ మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కానీ, కొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన లోపంతో పనులు ముందుకు సాగడంలేదన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
రూ.80 కోట్లతో అంతర్గత సీసీరోడ్లు
వర్ధన్నపేట మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే దళిత కానీలల్లో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టామని, మరిన్ని గ్రామాల్లోనూ అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు, అధికారులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గతంలో మంజూరైన ఈజీఎస్ నిధులను సర్పంచ్‌లు వినియోగించకపోవడంతో వృథా అయ్యాయన్నారు.
ప్రతి గ్రామంలో పంచాయతీ భవనం
నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో అధునాతన వసతులు కలిగిన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. వర్ధన్నపేట మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో నూతన భవనాలు నిర్మించాల్సి ఉందన్నారు. జీపీ భవనాలతో పాటు గ్రామైక్య సంఘాల భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులకు అండగా ఉంటా
గ్రామ ప్రజాప్రతినిధులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే రమేశ్ హామీ ఇచ్చారు. ప్రజల ఓట్లతో గెలిచిన తాను వారి మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలకూ అండగా నిలుస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, తహసీల్దార్ నాగరాజు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన పనులు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు నివేదికలు అందచేయాలన్నా రు. అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్‌లాల్, పార్టీ మండల అధ్యక్షు డు రంగు కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సర్వర్, మార్కెట్ డైరెక్టర్ ఏకాంతం గౌడ్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం రైతుబంధు పథకం
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చి న సీఎం కేఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ రైతుల సంక్షేమం కోసం 2021-22 పెట్టుబడి సాయా న్ని అందించారని తెలిపారు. రైతుబంధుతో పాటు రైతుబీమా రైతుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు శాంతి రతన్‌రావు, పట్టపురం ఏకాంతంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.