హనుమకొండ రస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్సీసీ క్యాడెట్ల ఎంపిక ప్రక్రియ నూతనంగా ప్రారంభమైన ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఎన్సీసీ 8వ గర్ల్స్ బెటాలియన్ సీనియర్ జె.సి.ఓ సుబేదార్ కే.రమణరావు పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 100 మంది విద్యార్థినులకు వివిధ టెస్టులు నిర్వహించి ఇందులో నుంచి 35 మందిని ఎంపిక చేసి 15 మంది విద్యార్థులను రిజర్వ్‌లో ఉంచినట్లు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.భిక్షాలు తెలిపారు.
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యంగా ఎన్సీసీలో ఉండటం వలన క్రమశిక్షణ, ఏకాగ్రత, దేశంపట్ల భక్తి, మానసికోల్లాసం మొదలైన లక్షణాలు పెంపొందించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ఎన్సీసీ యూనిట్ కేర్ టేకర్ వై.యశస్విని, కాలేజీ అధ్యాపకులు, సూపరిండెంట్ వీరునాయక్ పాల్గొన్నారు.