ఖిలావరంగల్, జనవరి 24 : బాలికల సాధికారతకు కృషి చేస్తూ వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని గీసుగొండ కేజీబీవీ, పర్వతగిరి మోడల్ స్కూల్, నర్సంపేటలోని సంజీవని ఆశ్రమంలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డులు, సర్టిఫికెట్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. బాలికలపై చూపుతున్న అసమానతలను పారదోరాలన్నారు. ఉన్నత చదువుల కో సం తల్లిదండ్రులు ప్రాధాన్యత కల్పించాల ని, తద్వారా ఆ కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శారద, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ, సభ్యులు రామలీల, మధు, షహేదాబేగం, సుజాత, సీనియర్ అసిస్టెంట్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, పీపీడీవో విశ్వజ, ఎంపీడీవోలు వింద్య, హేమలత, సీఐ స్వర్ణలత, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నా రు.
అలాగే, శివనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కే శ్రీధర్ ఆధ్వర్యం లో బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించారు. అవరోధాలు అధిగమించి విజేతలుగా నిలిచిన మహిళల గు రించి విద్యార్థులు నిత్యసంతోషిని, కరిష్మా, నిఖిత, పూజశ్రీ ఉపన్యసించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కాసం రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, జీసీఈ సీ కోఆర్డినేటర్ వీ లావణ్య, కరాటే మాస్టర్ సుమలత, ఉపాధ్యాయులు ఉపేందర్, ర వీందర్, శ్రీనివాస్, లావణ్య, భిక్షపతి, అం జయ్య, రాజ్‌కుమార్, కవిత, చంద్రకళ, ధనలక్ష్మి, శ్యామ, మోహన్ పాల్గొన్నారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి..జిల్లా సీనియర్ జడ్జి ఉపేందర్‌రావు
సంగెం : బాలికలు క్రమశిక్షణతో చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సీనియర్ జడ్జి జే ఉపేందర్‌రావు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కసూర్బాగాంధీ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి జిల్లా జడ్జి ఉపేందర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి విద్యార్థుల కు రాజ్యాంగంపై అవగాహన కలించా రు. కాగా, బాలికల దినోత్సవం సందర్భం గా కరాటే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఎంపీపీ కళావతి, పాఠశాల ప్ర త్యేకాధికారిణి నీలిమ, ఎంపీటీసీ మల్ల య్య, కరాటే మాస్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాలికల్లో ఆత్మైస్థెర్యం ఉండాలి
జాతీయ బాలికా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించారు. బాలికల్లో ఆత్మస్థైర్యం ఉండాలన్నారు. నర్సంపేట బాలిక ల ఉన్నత పాఠశాల హెచ్ఎం మాధవి ఆధ్వర్యంలో స్వయం కృషి సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో ఎఫ్ఎంఎం సోష ల్ సర్వీస్ సొసైటీ సహకారంతో బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన సద స్సు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి బె జ్జంకి ప్రభాకర్, టీచర్స్ రూపారాణి, రాజే శ్, వాణి, రాధిక, అరుణ, సుజాత, విజయ లక్ష్మి, పద్మ, నరేందర్, సురేష్‌కుమార్, రవీందర్‌రెడ్డి, భాస్కర్, రఘుపతిరెడ్డి, శ్రీని వాసరావు, రచ్చ శ్రీనుబాబు పాల్గొన్నా రు. గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణపై బాలికలకు అవగాహన కల్పించారు.
సర్పంచ్ గోనె మల్లారెడ్డి, హెచ్ఎం జ్యోతిర్మయి. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 16వ డివిజన్ ధర్మారం ప్రభుత్వ జడ్పీ ఉన్నతపాఠశాల లో బాలికల దినోత్సవ వేడుకలు నిర్వహిం చారు. హెచ్ఎం సుజాత, కమిటీ సభ్యుడు శ్రీకాంత్, ఉపాధ్యాయులు పద్మలత, పద్మా వతి, వజ్ర రాయపర్తి మండలంలోని క స్తూర్బా గాంధీ గిరిజన బాలికల ఆశ్రమ పా ఠశాలలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి బుర్ర కవిత, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమా ర్, సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్, గురుకుల సిబ్బం ది ప్రమీల, స్వరూప, రజిత, శైలజ, కరాటే మాస్టర్ చిన్నాల కుమారస్వామి పాల్గొన్నా రు. అలాగే తిర్మలాయపల్లి పాఠశాలలో దయన్న యువసేన వ్యవస్థాపక మండల అధ్యక్షుడు బదావత్ వీ రూనాయక్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చే శారు.
దుగ్గొండి మండలంలోని నాచినపెల్లి ఉన్నత పాఠశా ల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు శ్రీను, మాధవి, సుమలత, సు ధీర్కుమార్, కరంచంద్, వెంకట్రావు, సం ధ్యారాణి, నాగరాజు, ప్రదీప్ పాల్గొన్నారు. నల్లబెల్లి మండలకేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులకు కరాటే శిక్షణ తరగతులు ప్రా రంభించారు. సర్పంచ్ నానెబోయిన రాజా రాం, కరాటే కోచ్ విజయ్‌కుమార్, పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గిర్మాజీపేట కృష్ణ్ణకా లనీ ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ బండ్ల సురేందర్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించారు. హెచ్ఎం అ శోక్‌కుమార్, కరాటే మాస్టర్ ఎండీ యా కూబ్పాషా పాల్గొన్నారు. గీసుగొండలోని కేజీబీవీలో కరాటే శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో వాసంతి ప్రారంభించారు. స్పె షలాఫీసర్ హిమబిందు పాల్గొన్నారు.