హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: నిత్యజీవితంలో ప్రతి ఒక్కరు సైక్లింగ్ చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని హనుమకొండ సాట్ జిమ్నాస్టిక్ కోచ్ నరేందర్ అన్నారు. ఆదివారం నుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా సైక్లింగ్ పోటీలు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా నరేందర్ పాల్గొని మాట్లాడుతూ.. నిత్యం సైక్లింగ్ చేయడం వలన ఆరోగ్యం, ఆహ్లాదం, ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని తెలిపారు.
వయసుకు నిమిత్తం లేకుండా ప్రతిఒక్కరు సైక్లింగ్ చేయవచ్చని సూచించారు. అలాగే ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా కీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు ఈనెల 23వ తేదీ నుంచి నేటి వరకు అనేక కార్యక్రమం నిర్వహించామని 9 రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆదివారం సైక్లింగ్‌తో ముగిసాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో డీఎస్ఏ నాయకుడు బొడ్డు విష్ణువర్ధన్, రమేశ్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, నవీన్, ఇతర కోచ్‌లు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.