కరీమాబాద్ మార్చి 20 : రంగశాయిపేటలోని మహంకాళి దేవాలయంలో(Mahankali Temple )గురువారం జరిగిన ఉత్సవాల్లో వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నాపునేని నరేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం అన్నారు.
ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై మాజీ ఎమ్మెల్యే ఆలయ కమిటీతో చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.