కరీమాబాద్ ఏప్రిల్ 5 : బీఆర్ఎస్ పార్టీ గత 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అంకితమై పని చేస్తుందని వరంగల్ తూర్పు మాజీ మాజీ నన్నపనేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. రాబోయే రజతోత్సవ మహాసభలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 32వ డివిజన్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పొగాకు సందీప్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా నరేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రజతోత్సవ మహాసభలు ప్రతి కార్యకర్తకు పండుగలా మారాలని, ఎల్కతుర్తిలో జరిగే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సభకు హాజరయ్యే ప్రతి కార్యకర్త కోసం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు, భోజన సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సభలో పాల్గొని పార్టీ ఐక్యతను చాటాలని కోరారు.