గిర్మాజీపేట, ఆగస్టు 17 : వరుసగా నాలుగోసారి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికై ‘న మస్తే తెలంగాణ’ వరంగల్ ఫొటోగ్రాఫర్ మే రుగు ప్రతాప్ రికార్డు సృష్టించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇటీవల రాష్ట్ర సమాచార,
పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా వరంగల్ నగరానికి చెందిన మేరుగు ప్రతాప్ ఎంపికయ్యాడు. వరుసగా ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికైన ప్రతాప్‌ను పలువురు అభినందిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట గ్రీన్‌పార్క్ హోటల్లో సోమవారం అవార్డు అందుకోనున్నారు.