బచ్చన్నపేట, అక్టోబర్ 17 : బచ్చన్నపేట దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమార్కులకు అప్పగించడాన్ని నిరసిస్తూ అఖిలపక్షానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బచ్చన్నపేట ముస్లిం కమిటీ సభ్యులు అన్నారు. 50 ఏళ్లుగా కబ్జాలో ఉన్న బచ్చన్నపేట దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమంగా అక్రమార్కులకు కేటాయించడం నిరసిస్తూ ముస్లిం కమిటీ బచ్చన్నపేట మసీద్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అఖిలపక్ష పార్టీలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని తెలిపారు. బచ్చన్నపేట దుర్గామాత గుడి స్థలం అక్రమంగా కేటాయింపు చేసిన వారిపై చర్యలు తీసుకొవాలన్నారు. అఖిలపక్షంతో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారితో పాటు వారి మద్దతుగా అన్నీ కార్యక్రమాలలో పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు, సదార్ సమ్ సీర్, మున్నబాయి, గౌస్, అజీం, ఎక్బల్, షబద్దీన్, జహంగీర్, దస్తగిర్, షబ్బిర్, జావేద్, బషీర్, కాజమోయిద్దీన్, సత్తర్, నయుం, ఈసుబ్, సర్వర్, తదితరులు పాల్గొన్నారు.