ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మునుపు ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా అడవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఊరూరా అద్దంలా మెరిసే రోడ్లు, వీధివీధిలో లైట్లు. ఇలా ఎన్నో మౌలిక వసతులు కల్పించడంతో భూపాలపల్లి అభివృద్ధి పథంలో పయనిస్తోంది. సమైక్య రాష్ట్రంలో నగర పంచాయతీగా ఉన్న గ్రామం, స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడ్ అయ్యింది. దీంతో మున్సిపాలిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.476.27 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పట్టణంలో క్రీడా మైదానాలు, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డు, ఓపెన్ జిమ్, పార్కులు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. వీటికి తోడు సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులు కేటాయించడంతో మరిన్ని మౌలిక వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్ కృషితోనే అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన జిల్లా నిలుస్తోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జయశంకర్భూపాలపల్లి, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా ఉన్న భూపాలపల్లి స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అవడంతో పాటు జిల్లా కేం ద్రంగా రూపాంతరం చెందింది. తొమ్మిదేళ్ల లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన రూ.476. 27 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠధామం, ఓపెన్‌జిమ్, పార్కులు, క్రీడా మైదానాలు, ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్లు, సెంట్రల్ లైటింగ్, డబుల్ రోడ్లు, డంపింగ్ యార్డు, నిరాశ్రయులకు ఆశ్రమ భవనంతో పాటు మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికితోడు సింగరేణి సంస్థ 2014 నుంచి 2018 వరకు పట్టణం తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించింది. ఇలా భూపాలపల్లి మున్సి పాలిటీ రోజురోజుకూ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకరి స్తుండగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
రూ.104.55 కోట్లతో పనులు
మున్సిపాలిటీ పరిధిలో రూ.104.55కోట్లతో మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో 252 అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు.
మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు
మున్సిపాలిటీ పరిధిలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు లతో పాటు మిషన్ భగీరథలో భాగంగా రూ.70 కోట్ల తో 6 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. వీటిలో 4 ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. 125 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం పూర్తయింది. 12,197 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజు 10 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. నూతన కాలనీల్లో భగీరథ నీరు అందించడానికి మరో రూ.18 కోట్లు మంజూరయ్యాయి.
రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్
భూపాలపల్లి పట్టణంలోని గణేశ్ చౌక్ నుంచి జంగే డు మీదుగా కాశీంపల్లి వరకు రూ.25కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో బీటీ రోడ్డు (60 ఫీట్ల వెడల్పు), డివైడర్, సైడ్ కాల్వ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు. సైడ్ కాల్వ, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ కాలనీ మీదుగా కేటీకే ఓసీ-2క్రాస్ (జంగేడు) రోడ్డు వరకు బీటీ రోడ్డు , సైడ్ కాల్వ, సెంట్రల్ లైటిం గ్, డివైడర్ పనులకు రూ.4 కోట్ల సీఎస్ఆర్ నిధులు, రూ. 5కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరయ్యా యి. అదేవిధంగా మంజూర్‌నగర్ నుంచి పుల్లూరి రామయ్యపల్లి వరకు డబుల్ బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, సైడ్ కాల్వ, డివైడర్ పనులను రూ.9 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో పూర్తి చేశారు. జంగేడు నుంచి వేశాలపల్లి వరకు డబుల్ రోడ్డు పనులు రూ. 3.50 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. కాశీంపల్లి-సెగ్గంపల్లి మధ్య చాకలి ఒర్రెపై రూ.50 లక్షలతో బ్రిడ్జి నిర్మించారు. రూ.కోటి నిధులతో మహబూబ్పల్లిలో సీసీ రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. భూపాలపల్లి నుంచి మంజూర్ నగర్ వరకు డివైడర్ విస్తరణ పనులను రూ.2 కోట్లతో పూర్తి చేశారు.
రూ.60.30 లక్షలతో క్రీడా మైదానం, ఓపెన్ జిమ్
మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి మున్సిపాలిటీ పరిధిలో రూ.40 లక్షలతో 8 ప్రాంతాల్లో ఓపె న్ జిమ్‌లు ఏర్పాటు చేశారు.రూ.20.30 లక్షలతో 11 క్రీడా మైదానాలను అభివృద్ధి పరిచారు.
రూ.10.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
మున్సిపాలిటీ పరిధిలో రూ.10.50 కోట్లతో రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించారు. బస్‌స్టేషన్ వెనకాల రూ.కోటి 20 లక్షలతో 90 షాపులతో కూడిన వెజ్ మార్కెట్ పనులు పూర్తయ్యాయి. ఇక్కడే రూ.కోటి తో చేపట్టిన నాన్‌వెజ్ మార్కెట్ పనులు తుదిదశలో ఉన్నాయి. మున్సిపాలిటీ నూతన భవనాన్ని రూ.3 కోట్లతో నిర్మించారు.
రూ.10.85కోట్లతో పట్టణ ప్రగతి పనులు
పట్టణ ప్రగతిలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ.10.85 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూ రు చేసింది. రూ.3.5 కోట్లతో భూపాలపల్లి, కాశీంపల్లి, సెగ్గంపల్లిలో వైకుంఠధామాలను నిర్మించారు. రూ.8 లక్షలతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేశారు. రూ.50 లక్షలతో ఆక్యుపంక్చర్ పార్కు, రూ.33.20 లక్షలతో బృహత్ పట్టణ ప్రకృతి వనం నిర్మించారు. ఆర్టీసీ బస్ డిపో దగ్గర రూ.14.59 లక్షల తో 28 వీధి విక్రయదారుల షాపుల సముదాయాన్ని నిర్మించారు. 14వ ఆర్థిక సం ఘం నిధులతో 12 స్వచ్ఛ ఆటోలు, 6 ట్రాక్టర్లు, ఒక స్వీపింగ్ మిషన్, కంపాక్టర్ బిన్స్ వెహికిల్స్‌ను కొనుగో లు చేశారు. హరితహారంలో భాగంగా రూ.25 లక్షలతో అర్బన్ నర్సరీని ఏర్పాటు చేసి లక్షా 25వేల మొక్కల ను పెంచుతున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో కేటీకే 6వ గని సమీపంలో రూ.2.50 కోట్ల నిధులతో డంపింగ్ యార్డును నిర్మించారు. రూ.25 లక్షలతో పట్టణంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.
రోడ్డు నిర్మాణానికి రూ.135 కోట్లు
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డునుకు నిధులు కేటాయించాలనిఎమ్మెల్యే గండ్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ.135 కోట్లు మంజూరు చేశారు. మోరంచపల్లి నుంచి గుడాడ్పల్లి, గొర్లవీడు, మల్హర్ మండ లం అన్సాన్పల్లి, బోరుదోరుపల్లి, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి మీదుగా సీఆర్‌నగర్ జాతీయ రహదారికి కలిసేలా 23 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు.
4,657 ఎల్ఈడీ లైట్లు
మున్సిపాలిటీలో 4,657 ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఎఫ్ఎస్టీపీ నిర్మాణం జరుగుతున్నది. టీఎస్ బీపాస్‌లో 643 ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు.
మరో రూ.30 కోట్ల ప్రతిపాదనలు
ఫిబ్రవరి 23న జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గండ్ర మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూ రు చేస్తున్నట్లు సభలో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడుతగా రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో ప్రస్తుతం పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
960 డబుల్ బెడ్రూం ఇండ్లు
భూపాలపల్లిలో 960 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణం చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లిలో రూ.33.08 కోట్లతో 544 ఇండ్లు పూర్తవగా, ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భాస్కరగడ్డలో 416 ఇండ్ల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. రూ.కోటి 39 లక్షలతో పట్టణంలోని నిరాశ్రయులకు 50 పడకలతో షెల్టర్ ఫర్ హోంలెస్ భవనాన్ని నిర్మించారు. రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. రూ.కోటి నిధులతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టారు. ప్రభు త్వ డిగ్రీ కళాశాల సమీపంలో రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా జయశంకర్ పార్కును నిర్మించారు.
జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం
భూపాలపల్లి పట్టణంలోని డిగ్రీ కళాశాల సమీపం లో రూ.5.30 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులను ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. a
క్రీడాకారులకు ఎంతో ఉపయోగం
సింగరేణి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతున్నారు. మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగం.
– సిరపురపు సాయికృష్ణ, బాక్సింగ్ కోచ్
కేసీఆర్ దయతో నీళ్ల గోస తీరింది
మిషన్ భగీరథ లేకముందు నీళ్ల కోసం గోసపడేటోళ్లం. ఎండకాలం వచ్చిందంటే బోర్ల నుంచి నీళ్లు రాకపోయేది. మున్సిపాలిటీ ట్యాంకర్లు కోసం ఎదురు చూసేది. భూపాలపల్లిలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి నీళ్ల గోస తీరింది. కేసీఆర్ సార్ దయతో గోస తీరింది.
– గీట్ల సుజాత, రెడ్డి కాలనీ, భూపాలపల్లి