సర్కారు బడుల బలోపేతం కోసం రాష్ట్రప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. ప్రతి ప్రభు త్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు ములుగు జిల్లాలోని 125 స్కూళ్లను మొదటి విడుత ఎంపిక చేసింది. ఆయా పాఠ శాలల్లో చేపట్టాల్సిన పనులను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి, రూ. 26 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ నిధులతో స్కూళ్లలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, భవనాలు, ఫర్నిచర్ మరమ్మతులు, కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్స్ వంటి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 50 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా, మిగిలిన 75 స్కూళ్లలోనూ జూన్ 15లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపా టు ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల బోధన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ములుగు, జూన్6(నమస్తే తెలంగాణ): సరారు బడులను చకదిద్దడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అందు లో భాగంగా ములుగు జిల్లాలో మొదటి విడుతగా 125 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి రూ.26 కోట్ల నిధులను విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో సూల్ మానిటరింగ్ కమిటీల ద్వారా 50 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. తొలి దశలో ఎంపికైన 125 ప్రభుత్వ పాఠశాలల్లో 84 స్కూళ్లలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు 12 రకాల అభివృద్ధి పనుల కోసం అంచనాలు రూపొందించారు. నివేదికలను కలెక్టర్కు సమర్పించగా 83 పాఠశాలలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి 81 పాఠశా లలకు సాంకేతిక అనుమతుల ప్రెసిడెంట్ విడుదల చేశారు. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను ప్రా రంభించిన అధికారులు ప్రస్తుతం పనులు ప్రారంభ మైన 50 పాఠశాలలతోపాటు మిగిలిన 75 స్కూళ్లలో నూ జూన్ 15వ తేదీలోగా అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ. 26కోట్లతో అభివృద్ధి పనులు
మన ఊరు-మన బడి కార్యక్ర మంలో భాగంగా జిల్లాలో మొదటి విడుత రూ. 26 కోట్లతో పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులు చేపట్టిన పాఠశా లల్లో మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం, నూతన గదుల నిర్మాణం, వంట గదులు, డైనింగ్ హాల్, గ్రీన్ బో ర్డులు, పెయింటింగ్, విద్యుత్, ఫర్నిచర్, తాగునీటి వసతి, ల్యాబ్ వంటి మౌలిక వసతులను సమకూర్చ నున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులను నివేదిక రూపంలో తయారుచేసి ఎస్ఎంసీ చైర్మన్, సంబంధిత గ్రామ సర్పంచ్, పాఠశాల అభివృ ద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో నిర్ణయాలు తీసుకుని పనులు చేపట్టారు. రూ. 30 లక్షల లోపు పనులను ఎస్ఎంసీల ఆధ్వర్యంలో చేపట్టి, అంతకుమించయితే టెండరు ప్రక్రియ ద్వారా పనులు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల బోధన అందించేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆదర్శంగా మండలానికి 4 పాఠశాలలు
మన ఊరు-మన బడి కింద ములుగు మండలం లో 23 పాఠశాలను గుర్తించి 6 పాఠశాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఏటూరు నా గారం మండలంలో 11 పాఠశాలలను గుర్తించి 7, గోవిందరావుపేట మండలంలో 12 పాఠశాలలను గు రించి 2, కన్నాయిగూడెం మండలంలో 6 పాఠశాలల ను గుర్తించి 4, వెంకటాపూర్ మండలంలో 15 పాఠశా లలను గుర్తించి 10, వాజేడు మండలంలో 14 పాఠశా లలను గుర్తించి 11, వెంకటాపురం(నూగూరు) మండ లంలో 16 పాఠశాలలను గుర్తించి 10 స్కూళ్లలో అభి వృద్ధి పనులను విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించా రు. కాగా మంగపేట మండలంలో 16, సమ్మక సార క తాడ్వాయి మండలంలో 12 పాఠశాలలను గుర్తిం చి అభివృద్ధి పనులను ప్రారంభించాల్సి ఉండగా సాంకే తిక కారణాలతో ఇప్పటివరకు పనులు ప్రారంభిం చలేదు. అభివృద్ధి పనులను పూర్తి చేసిన అనంతరం ప్రతి మండలానికి 4 పాఠశాలలను ఆదర్శ పాఠశాల లుగా ఎంపిక చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
అందనున్న కార్పొరేట్ స్థాయి విద్య
ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన కా ర్పొరేట్ స్థాయి విద్య అందనున్నది. ఈ కార్య క్రమం చాలా గొప్పది. పేద, మధ్య తరగతి విద్యా ర్థుల తల్లిదండ్రులకు ఇది శుభవార్త. తొలి విడుత ఎంపికైన పాఠశాలలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రా రంభం కానున్నందున ఉపాధ్యాయులకు సైతం శిక్షణను ఇచ్చాం.
– పాణిని, ములుగు డీఈవో