గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తాయి : కేడీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్
గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తాయి కేడీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 12 : గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాసక్తినీ పెంపొందించడంలో, విజ్ఞానాన్ని, ఉపాధి అవకాశాలను కల్పించడంలో నిరంతరం పాటు పడుతున్నాయని, విద్యార్థులందరూ విధిగా తమకనుకూల సమయంలో గ్రంథాలయలో లభ్యమయ్యే అకడమిక్ అండ్ పోటీ పరీక్షలకు ఉపయోగపడే వివిధ రకాల వనరులనూ ఉపయోయగించుకోవాలని కేడీసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ అన్నారు. హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా.ఎస్. ఆర్.రంగనాథన్ 134వ జయంతి పురస్కరించుకొని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. శ్రీనివాస్ గారి అధ్యక్షతన జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవంను కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గ్రంథాలయాల సమర్ధ నిర్వహణలో గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చి దిద్దడంలో గ్రంథ పాలకుల పాత్ర అతి ముఖ్యమైనదన్నారు. కళాశాల గ్రంథాలయ అధికారి డాక్టర్ ఎన్.భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, గ్రంథాలయ కమిటీ సభ్యులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Hanumakonda
- KDC
- Libraries
- srinivas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

