హైదరాబాద్ : హరీశ్ రావు ప్రాజెక్టుల మీద ప్రశ్నించగానే దేవాదుల ప్రాజెక్ట్ మోటర్లు ఆన్ చేయడానికి హెలికాప్టర్లో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి కల్లు తాగి, కోడి కూర తిని విహారయాత్ర చేసి వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నీళ్లవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించామన్నారు. నీళ్లు ఇవ్వకుంటే జనంలో పరువుపోతుందని భయపడిన కాంగ్రెస్ పార్టీ హడావుడిగా దేవాదులకు మంత్రులను పంపించింది. కానీ వాళ్లు వచ్చి రైతులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.
హరీష్ రావు ప్రాజెక్టుల మీద ప్రశ్నించగానే దేవాదుల మోటార్లు ఆన్ చేయడానికి హెలికాప్టర్లో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి కల్లు, కోడి కూర తిని విహారయాత్ర చేసి వచ్చారు
– మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి pic.twitter.com/laFslzkrNs
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026