Pakistan : ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్‌పై సోమవారం పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఆఫ్గనిస్తాన్‌లోని కునార్, పక్తిక ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దులో కొనసాగుతున్న తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో పాక్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం వేకువఝామున పాక్ వైమానిక దాడులకు దిగింది.
పక్తిక ప్రావిన్స్‌లోని బర్మాల్ జిల్లా, రఖా, తోర్కండి ప్రాంతాలపై రెండు చోట్లా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇల్లు, ఒక షాపు ధ్వంసమైంది. కునార్ ప్రావిన్స్‌లో పాక్ జరిపిన దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతిచెందారు. అయితే, ఈ దాడిపై స్పష్టమైన వివరాలు తెలియలేవు. అయితే, సాధారణ పౌర నివాసాలపై దాడి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆఫ్గనిస్తాన్‌పై పాక్ జరుపుతున్న దాడుల్లో వందల మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది.
గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల్లో దాదాపు 399 మంది గాయపడ్డారు. వీరిలో 57 మంది మరణించారు. 342 మంది గాయపడ్డారు. బాధితుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పాక్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ దాడులపై తాలిబన్లు కూడా ఘాటుగా స్పందించారు. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తమ దేశంలో ఉగ్రవాదుల్ని చేర్చుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆఫ్గన్ ఖండించింది.