ఏటూరునాగారం, అక్టోబర్ 19 : ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని కొమురంభీం స్టేడియంలో క్రీడోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం పోటీలు హోరాహోరీగా సాగాయి. అండర్-14 కబడ్డీ బాలుర విభాగంలో ఉట్నూరు జోన్‌పై ఏటూరునాగారం జోన్ టీం విజయం సాధించింది. బాలికల విభాగంలో మైదాన ప్రాంత జోన్‌పై ఏటూరునాగారం టీం పైచేయిగా నిలిచింది. అండర్-17 వాలీబాల్ బాలుర విభాగంలో మైదాన ప్రాంత జట్టుపై ఏటూరునాగారం జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో ఉట్నూరు జోన్‌పై భద్రాచలం జోన్ గెలుపొందింది.
అథ్లెటిక్స్‌లో హవా..
అండర్-17 లాంగ్‌జంప్ బాలుర విభాగంలో భద్రాచలం జోన్‌కు చెందిన వెంకటేశ్వర్రావు ప్రథమ స్థానం, ఉట్నూరు-2 జోన్‌కు చెందిన జే ప్రశాంత్, ఎస్.సంతోష్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
అండర్-17 షాట్‌పుట్ బాలికల విభాగంలో ఆసిఫాబాద్ నుంచి ఎం అరుణశ్రీ ప్రథమ, ఎం కృష్ణవేణి ద్వితీయ, ఉట్నూరుకు చెందిన పీ అనురాధ తృతీయ స్థానం సాధించారు.
పరుగుపందెం బాలికల విభాగంలో..
400 మీటర్ల పరుగుపందెంలో భద్రాచలం జోన్‌కు చెందిన శ్రీ వల్లిక ప్రథమ, ఏటూరునాగారం జోన్‌కు చెందిన ఎం శైలజ ద్వితీయ, బీ దుర్గ తృతీయ బహుమతులు గెలిచారు. 600మీటర్ల పరుగుపందెంలో భద్రా చలం జోన్‌కు చెందిన జాహ్నవి ప్రథమస్థానం, ఆసిఫాబాద్‌కు చెందిన ఎస్. శ్రీలత ద్వితీయ, ఎస్ శిరీష తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీ టర్ల బాలికల విభాగంలో జోన్-4కు చెందిన వీ మోతుబాయి ప్రథమ, ఎం లావణ్య ద్వితీయ, ఏటూరునాగారం జోన్‌కు చెందిన వీ దివ్యశ్రీ తృ తీయ స్థానంలో నిలిచారు.
బాలుర విభాగంలో
400 మీటర్లు అండర్-14 బాలుర విభాగంలో మైదాన ప్రాంతానికి చెందిన కే అకాశ్ ప్రథమ, పీ హుస్సేన్ ద్వితీయ, ఏటూరునాగారం జోన్ కు చెందిన ఎం. సతీశ్ తృతీయ స్థానం సాధించారు. 600 మీటర్ల విభా గంలో ఉట్నూరు జోన్‌కు నుంచి జే ప్రవీణ్ ప్రథమ, కే పరశురాం ద్వితీ య, ఏటూరునాగారం జోన్‌కు చెందిన ఎం.చరణ్ తృతీయ స్థానం సాధించారు. 800 మీటర్లలో కే తలంగ్రావు ప్రథమ ఏ సునీల్ ద్వితీయ, ఏటూరునాగారానికి చెందిన బీ నరీన్ తృతీయ స్థానంలో నిలిచారు.
ఆర్చరీలో ఓవరాల్ చాంపియన్ భద్రాచలం
అండర్-17 ఆర్చరీ బాలికల విభాగంలో భధ్రాచలం జోన్‌కు చెందిన జే సునంద, ఎం.కల్పన, కే సాత్విక, వీ కల్పన సత్తా చాటారు. 40 మీటర్లలో అండర్-17 బాలికల విభాగంలో భద్రాచలం జోన్‌కు చెందిన ఎం.కల్పన, జే సాత్విక, కే కల్పన, 30 మీటర్లలో భద్రాచలం జోన్‌కు చెందిన జే సునంద, ఎం.కల్పన, ఉట్నూరు జోన్‌కు చెందిన ఎం.సుమిత్ర విజేతలుగా నిలిచారు. టీం చాంపియన్ షిప్లో భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం జోన్లు ఉన్నాయి. కాగా ఆసిఫాబాద్ నుంచి వాలీబాల్ ఆడేందుకు వచ్చిన ఆత్రం శైలజ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యులు చికిత్స అందించారు. ఖోఖో కోర్టు పూర్తిగా మొరంతో ఉండడంతో చిన్నచిన్న రాళ్లు గుచ్చుకొని క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. ఎర్రమట్టి బదులు మొరం పోయడం వల్ల గాయాలు అవుతున్నాయని పలువురు క్రీడాకారులు వాపోయారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి : ఐటీడీఏ పీవో అంకిత్
రెండో రోజు 2కే రన్‌ను, పోటీలను ప్రారంభించిన అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్చార్జి అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ పోచం, ఏటీడీవో దేశీరాంనాయక్, ఎస్వో రాజ్‌కుమార్, పీహెచ్‌వో రమణ, స్పోర్ట్స్ అధికారులు శ్యామలత, యా లం ఆదినారాయణ, ఏసీఎంవోలు శ్రీరాములు, రవీందర్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పొదెం కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.పోటీలు, భోజన వసతి ఏర్పాట్లను డీడీలు పోచం, మంకిడి ఎర్రయ్య, జహీరుద్దీన్, ప్రేమకళ, పర్యవేక్షిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో క్రీడా ప్రాంగణంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయులు నల్లబోయిన కోటయ్య, అన్నవరం వెంకటేశ్వర్లు తెలిపారు. ఏటూరునాగారం, హనుమకొండ, భద్రాచలం, హైదరాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మైదాన ప్రాంతం, మహబూబాబాద్ క్రీడల నిర్వహణ అధికారులు ఏ కిష్టు, వీరునాయక్, జ్యోతి, పార్థసారథి, మధుసూదన్, వీ నారాయణ, యాలం ఆదినారాయణ, శ్యామలత, భీమా, మోహన్, స్కౌట్ ఆఫీసర్లు గోపాల్, ఫకీరా తదితరులు తమ క్రీడాకారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.