ములుగు, అక్టోబర్19(నమస్తేతెలంగాణ): మావోయిస్టులు తమ సిద్ధ్దాంతాలను వీడి అజ్ఞా తం నుంచి బయటకు వచ్చి సామాన్య పౌరులు గా జీవించి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయా లని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ టీ ప్రభాకర్‌రావు, ఐజీలు నాగిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి తెలంగా ణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో పర్యటించారు. ఇందులో భాగంగా పూసుగుట్టను సందర్శించారు. అనంతరం వెంకటాపురం(నూగూరు) సర్కిల్ కా ర్యాలయంలో ములుగు, జయశంకర్ భూపాలప ల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య ఎట్టి పరిస్థితు ల్లో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు. అంతర్ రాష్ట్ర బార్డర్లో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిరంతరం యాంటీ మావోయిస్టు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మావోయిస్టుల్లో రాష్ర్టానికి సంబంధించిన చాలా మంది అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు.
సెంట్రల్ కమిటీలో 20 మంది ఉంటే, అందులో 11 మంది, మిగతా 130 మంది వరకు తెలుగు వారు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరందరు జన జీవన స్రవంతిలో కలిసి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మావోయి స్టు కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు సహకరించాలని కోరారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలు సహకరించేలా పనిచేస్తున్నా యని అన్నారు. అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టుల సమస్య తిరిగి పునరావృతం కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సెంట్రల్ పారామిలటరీ ఫోర్స్, గ్రేహౌండ్స్, పోలీ సులు, రాష్ట్ర ఎస్ఐబీ సంయుక్తంగా పనిచేస్తున్నా యని చెప్పారు. డీజీపీ వెంట ములుగు, జయ శంకర్భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సురేందర్‌రెడ్డి, శరత్చంద్ర పవా ర్, వినిత్, ములుగు ఓఎస్డీ గౌస్ఆలం, ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్, వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్సైలు తిరుపతి, అశోక్ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.