కరోనా చికిత్సల అనుమతులు రద్దు
వరంగల్, మే 31 : నగరంలోని మ్యాక్స్‌కేర్, లలితా దవాఖానలపై వేటు పడింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కరోనా చికిత్సలకు అధిక ఫీజు లు వసూలు చేశారన్న పిర్యాదులపై రాష్ట్ర వైద్యశాఖ చర్యలు తీసుకుంది. మూడు రోజుల కిత్రం నోటీసులు జారీ చేసి, 48 గంటల్లో ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే నగరంలోని మ్యాక్స్‌కేర్, లలితా దవాఖానల కరోనా చికిత్స అనుమతులను రద్దు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.