గ్రామాల అభివృద్ధి కోసమే నేరుగా నిధులు
జిల్లా అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి
గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా
వరంగల్ జిల్లా రాంచంద్రాపురంలో పర్యటన
పల్లెప్రగతి పనుల క్షేత్రస్థాయి పరిశీలన
వరంగల్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
15 రోజుల్లో వైకుంఠధామాలు పూర్తిచేయాలని ఆదేశం
సంగెం, ఆగస్టు 18 : పల్లెప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలంలోని రాంచంద్రాపురం గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులను కలెక్టర్ హరితతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని దళితవాడల్లో కలియదిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. వైకుంఠధామంలో మొక్కలు నాటారు. మహిళా సంఘంలో రుణం తీసుకుని ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేశారని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం రాక ముందు గ్రామాలు ఎలా ఉండేవి.., ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. లోపభూయిష్టంగా ఉన్న పాత చట్టాన్ని రద్దు చేసి, ఎన్నో చర్చల అనంతరమే నూతన చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చట్టంతో గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు వస్తుండడంతో అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.
గ్రామపంచాయతీలు నేడు రాష్ర్టానికి కేంద్ర బిందువుగా మారాయన్నారు. జిల్లా అధికారులు గ్రామాలను దత్తత తీసుకుంటే త్వరగా అభివృద్ధి జరిగే అవకాశముంటుందన్నారు. రాంచంద్రాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న డీఆర్డీవో సంపత్‌రావును, గ్రామా న్ని అభివృద్ధి చేసిన సర్పంచ్ బోంపెల్లి జయశ్రీదిలీప్రావును అభినందించా రు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలు అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. 57 సంవత్సరాలు నిండి న ప్రతి ఒక్కరూ ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీ సేవ కేంద్రాల్లో ఉచితంగానే దరఖాస్తు చేస్తారని, డబ్బులు అడిగితే సంబంధిత తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, వరంగల్ జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో సంపత్‌రావు, ఏపీ డీ వసుమతి, ఎంపీపీ కందకట్ల కళావతి, సర్పం చ్ బోంపెల్లి జయశ్రీ, ఎంపీటీసీ చిదిరాల రజిత, ఎంపీడీవో మల్లేశం, తహసీల్దార్ విశ్వనారాయ ణ, నరహరి, మండలప్రత్యేకాధికారి రాజార త్నం, నాయకులు బోంపెల్లి దిలీప్‌రావు, చిదిరా ల కృష్ణంరాజు, రమేశ్, సమ్మయ్య, ఏపీవో లక్ష్మి, ఉపసర్పంచ్ మనోజ్, పంచాయతీ కార్యదర్శి వంశీ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.