యూనివర్సిటీ భూములను కాపాడుతాం
కబ్జా కాకుండా ప్రహరీ నిర్మిస్తాం
విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు
కేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్
భీమారం, జూలై2: కాకతీయ యూనివర్సిటీలో పీవీ నర్సింహారావు విజ్ఞానం పీఠం పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.3 కోట్లతో పీవీ విజ్ఞానం పీఠాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞానం పీఠంలో ప్రధానంగా వివిధ అంశాలపై అధ్యయనం, పరిశోధనలపై ఫోకస్ పెట్టనునట్లు వివరించారు. తెలంగాణ చరిత్ర, భాషా, సంస్కృతి, సామాజిక, ఆర్థ్ధికరంగాలపై పీవీ తీసుకొచ్చిన భూసంస్కరణలు, సెమినార్లు, విషయనిపుణలతో గెస్ట్ లెక్చర్స్, కాన్ఫరెన్స్, వివి ధ కార్యక్రమాలు, అధ్యయనాలు చేపడుతామన్నారు. పీవీ రచనలపై డిజిటల్ లైబ్రరీ రూపొందిస్తామన్నారు. వారి జీవితంపై చేసిన పరిశోధనలు డిజిటల్ రూపంలో భద్రపరుస్తామన్నారు. యూనివర్సిటీ భూమి ఇంచు కూడా ఆక్రమణ కానివ్వమని, కబ్జా చేయకుండా ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు. ఉద్యోగులు భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
త్వరలో పోస్టుల భర్తీకి కసరత్తు..
యూనివర్సిటీలోని ఖాళీలు భర్తీ చేయానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వైస్ చాన్స్లర్ తెలిపారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో తెలంగాణ దక్షిణ భారత ధాన్యాగారంగా మారిందన్నారు. సమావేశం లో కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జున రె డ్డి, పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అభివృద్ధి అధికారి రామచం ద్రం, ప్రొఫెసర్లు డేవిడ్, అయిలయ్య, రాజయ్య పాల్గొన్నారు.