Mulkanoor | భీమదేవరపల్లి, మే 24: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘంలోని 5 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినట్లు ఎన్నికల అధికారి కోదండ రాములు తెలిపారు. శనివారం ముల్కనూరు సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ముల్కనూరు సహకార సంఘంలో మొత్తం 15 డైరెక్టర్ స్థానాలు ఉండగా 1, 5, 9, 12, 15 ఖాళీ అయ్యాయి. ఈ స్థానాలకు వచ్చే నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 16వ తేదీన నామినేషన్ దాఖలు, 17న నామినేషన్ పత్రాల పరిశీలన, 18వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం నామినేషన్ పత్రాలు తుది జాబితా ప్రచురణ, గుర్తుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ప్రకటన సైతం 18వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. వచ్చే నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుందని అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే నెల 30వ తేదీన నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుగుతుందని తెలిపారు.