వరంగల్చౌరస్తా, నవంబర్ 17 : ఎంజీఎం హాస్పిటల్ మెడికల్ రికార్డు వి భాగం డిస్పాచ్ ఉద్యోగి కమలాకర్ తన కు బదులుగా ఓ ప్రైవేట్ వ్యక్తితో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇష్టారీతిన వసూళ్లు చేయడంతో పాటు అతడి వేధింపులు భరించలేక కొందరు పోలీసులు సోమవారం దవాఖాన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసుల విషయంలో కోర్టుకు సమర్పించాల్సిన మెడికల్ సర్టిఫికెట్స్ను సమ కూర్చుకోవడం కోసం ఒక్కో పోలీస్ స్టేషన్కు ఒక్కో కానిస్టేబుల్ మెడికల్ బాధ్యతలు చేపడుతూ ఉంటారు. ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు, హత్యలు, హత్యాయత్నాలు, ప్రమాద బాధితుల మెడికల్ ట్రాక్ రికార్డును అందించడానికి సంబంధిత ఉద్యోగి ఇబ్బందులకు గురిచేయడం, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న సంబంధిత ఉద్యోగి హైదరాబాద్ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడని, సమయానికి విధులకు హాజరుకావడం లేదని, ఆయన స్థానంలో ఎలాంటి అనుమతులు లేకుండా మరో ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసి ఉద్యోగ కార్యకలాపాలు, అక్రమ వసూళ్ల దందాను కొన సాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకునే సమయానికి అతడిని తప్పించారు. దాంతో ఆర్ఎంవో స్థాయి అధికారి ఉన్నతాధికారులను సంప్రదించి తాత్కాలిక చర్యల్లో భాగంగా ఎంఆర్డీ ఉద్యోగిని ఓపీ స్టాటిస్టిక్స్ విభాగానికి బదిలీ చేస్తూ, గతంలో ఎంఆర్డీ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించిన ఉద్యోగికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. త్వరలో విచారణ జరిపి సంబంధిత ఉద్యోగిపై చర్యలకు అధికారులు సమాయతమవుతున్నారు.