మహదేవపూర్, జూన్ 4 : గ్రామ పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని మండల పంచాయతీ అధికారి ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని ఎడపల్లి గ్రామంలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని జిపి కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డును రిజిస్టర్లను పరిశీలించారు.
అనంతరం పారిశుధ్య పనులను పరిశీలించి కార్యదర్శి మహేష్ కు పలు సూచనలు చేశారు. నర్సిరీల్లో పెంచుతున్న మొక్కలకు సకాలంలో నిరందించాలని ఆదేశించారు. గ్రామంలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లను సకాలంలో శుభ్రపరచాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్, జిపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.