లింగాల గణపురం : ఆకుకూరల్లో సంపూర్ణమైన పోషక విలువలు ఉంటాయని ఎంపీడీవో జలంధర్ రెడ్డి అన్నారు. లింగాల గణపురం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం జరిగిన పోషక పక్షోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నారులకు చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందిస్తే శారీరక ఎదుగుదల బాగుంటుందన్నారు.
ముఖ్యంగా గర్భిణిలు, బాలింత మహిళలు తప్పకుండా ఆకుకూరలు, చిరుధాన్యాలను తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సావిత్రి, ఇందిర, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే నాగారంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శ్రీలత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.