Warangal | మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాసరి సురేందర్ గ్యాంగ్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన దాసరి సురేందర్ అలియాస్ సూరీని వరంగల్ (Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎనిమిది మంది ముఠా సభ్యులను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియా ఎదుట హాజరుపరిచారు.
సుబేదారి, నవంబర్ 07: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన దాసరి సురేందర్ అలియాస్ సూరీని వరంగల్ (Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎనిమిది మంది ముఠా సభ్యులను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియా ఎదుట హాజరుపరిచారు. కరడుగట్టిన నేరస్తుడు సూరీ హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణకు గురైన తరువాత వరంగల్ నగరంలోని భీమారంలో మకాం వేశాడు. ఏడుగురితో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు.
అక్టోబర్ 18న రాత్రి సమయంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శాయంపేట మండలం మందారిపేట హైవే రోడ్డులో లారీ డ్రైవర్ను బెదిరించి రెండు బైకులలో పెట్రోల్ పొయించుకున్నాడు. లారీ డ్రైవర్ పిర్యాదు మేరకు శాయంపేట, వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి రెండు పిస్టల్స్, కత్తి, రెండు బైకులు, ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది ముఠాలో నలుగురు విద్యార్థులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

