లింగాల గణపురం : రాష్ట్రంలో కోతుల (Monkeys) బెడద తీవ్ర రూపం దాలుస్తున్నది. వానరాలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. ఇండ్లలోకి చోరబడి నానా హంగామ సృష్టిస్తున్న కోతులు పంట చేలను సైతం వదలడం లేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడులకు పాల్పడి, ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
తాజాగా జనగామ జిల్లా లింగాల గణపురంలో కోతులు ఓ వరి పొలాన్ని ధ్వంసం చేశాయి. లింగాల ఘనపురానికి చెందిన జాగిళ్ల పురం పెద్ద ఉప్పలయ్య తనకున్న రెండు ఎకరాల్లో వారిని సాగు చేశాడు. వరి చేను అంతా ఈని పొట్ట దశలో ఉంది. ఈ దశలో కోతుల గుంపు వరి చేనుపై దాడి చేసి వరి గొలుసులను నేలపాలు చేశాయి. ఈ సంఘటనలో ఉప్పలయ్యకు 30 గుంటల వరి పంట ధ్వంసం అయింది. కోతుల బెడదను రక్షించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.