కురవి, సెప్టెంబర్ 5 : ఇటీవల కురిసిన వర్షాలకు ఆకేరు వాగు ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని సీతారంతండాను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సందర్శించారు. తండా అంతా కలియదిరిగి జరిగిన వి ధ్వంసాన్ని పరిశీలించారు. ఆమెను చూడగానే తండా మహిళలు ఒక్కసారిగా భోరున విలపించడంతో ‘మీకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది.. వరద వచ్చిన రోజున నేను ఇ క్కడ లేను.
ఆ భగవంతుడు మనతో ఉన్నందునే ప్రాణనష్టం జరగలేదు. మీకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు’ అంటూ వారిని అక్కున చే ర్చుకొని ఓదార్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాం త ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతానికి సహాయపడాలని గిరిజన బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బాధిత కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు.
తండాలోని బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో గుగులోత్ హన్మంతు ఇంటికి వెళ్లగా స త్యవతి రాథోడ్‌కు బాలింత కనిపించింది. వెం టనే ఆమెను కొడుకా.. బిడ్డా అంటూ అడిగింది. ఆ సమయంలో బాలింత అత్త పారు సత్యవతిరాథోడ్పై పడి భోరున విలపించింది. ‘నా కొ డుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోడలు శిరీష గొడవల వల్ల ఇంటి వద్దనే రెండు నెలల కింద ప్రసూతి అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున నీళ్ల వచ్చే సమయంలో చుట్టు పక్కల వాళ్లు బాబును గంపలో పెట్టుకొని, కోడలును పట్టుకొని దగ్గరలోని డాబా ఎక్కించారు’ అం టూ సత్యవతికి వివరించింది. ఆ బాబును ఎత్తుకున్న సత్యవతి ‘నీ కొడుకు మృత్యుంజయుడ మ్మా.. బాధపడకు.. నువ్వు ఆ సమయంలో ప డిన కష్టం వృధా కాదు’ అంటూ ఓదార్చింది.
మహబూబాబాద్‌కు చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో 40 మందికి ని త్యావసర వస్తువులు, మహబూబాబాద్ జీన్స్ కార్నర్ సహకారంతో 100 మందికి బట్టలు, ఇల్లందుకు చెందిన జై గణేశ్ ట్రేడర్ సహకారంతో 50 మందికి దుస్తులు, 30 కిలోల పులిహోర అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ జె నవీన్‌కుమార్, సెక్రటరీ కే లీలావతి, యాదగిరి, సుజాత, పద్మావతి, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ పరివార్ సేవాసమితి ఆధ్వర్యంలో 16 మందికి నిత్యావసరాలను సీఈ వో డాక్టర్ వివేక్ అందజేశారు. వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు రవి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలను అభినందించారు. కార్యక్రమంలో విష్ణు, బీమానాయక్, మంగీలాల్, వెంకన్న, రాంమూర్తి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వరదకు కొట్టుకుపోయిన పురుషోత్తమాయగూడెం 365 జాతీయ రహదారిని మరమ్మతు పనులను అధికారులు పూర్తిచేశారు. మట్టిపోసి రోడ్డు రోలర్‌తో తొక్కించి రాకపోకలకు అనువుగా తయారుచేశారు. శుక్రవారం నుంచి వాహనాలు ప్రయాణించనున్నాయి.