కృష్ణకాలనీ, నవంబర్ 26 : ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమంతో బీఆర్ఎస్ వేసే తొలి అడుగు దద్దరిల్లాలని, రాష్ట్రంలో మరో ఉద్యమానికి పునాది కావాలని మాజీ మం త్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ మళ్లీ రావాలని, ఆయన వస్తేనే తమ బాధలు తీరుతాయని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి సత్యవతి ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హయాంలో భూ పాలపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింద ని, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాతో పాటు వంద పడకల ఆస్పత్రి, మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయన్నారు.
తెలంగాణను సా ధించిన కేసీఆర్‌ను బుల్డోజర్లతో తొకిస్తా, పేగులు మెడకు వేసుకొని తిరుగుతా, బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపిస్తా అంటూ వీధి రౌడీలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, పదవిని దకించుకునేందుకు అధిష్టానం కాళ్లు మొకిన చరిత్ర ఆయనదన్నా రు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలనలో ఫెయిల్ అయ్యామని కాం గ్రెస్ నేతలు చెప్పుకుంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ సంబురాలు ఎందుకు చే స్తున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకావడం లేదని, మూసీని రూ. 1,50,000 కోట్లతో సుందరీకరిస్తానని దొంగ మాటలు చెబుతున్నాడన్నారు. ప్రజల సొమ్మును దోచుకోవడానికే మూసీ నది అనే కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడని ఎద్దేవా చేశారు. దోచుకోవడం, దా చుకోవడమే అతడి నైజమని, ప్రజలకు ఇచ్చేదేమీ లేదన్నారు. తాను అందరిని తొకుకుం టూ వచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న రే వంత్రెడ్డిని కాంగ్రెస్‌లోని సీనియర్లు నమ్మ డం లేదన్నారు. ఇటీవల ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొచ్చానని చెప్తున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దాని నిర్మాణానికి తెచ్చిన నిధులెన్నో చూపించాలని డి మాండ్ చేశారు.
తాను మంత్రిగా ఉన్నప్పు డు ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఇప్పుడు ఇద్దరున్నప్పటికీ వారు నిధులు తీసుకురావడం లేదని, కనీసం మం త్రుల లాగా ప్రవర్తించడం లేదన్నారు. పదే పదే కేసీఆర్ రావాలంటున్న రేవంత్‌రెడ్డి.. ఆయన బయటకు వస్తే తట్టుకోలవా? అని సత్యవతి ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, ము న్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్లు మేకల సంపత్‌కుమార్, కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూనె రాజుపటేల్, అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజుగౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొడంగల్ నియోజకవర్గంలో తిరిగే ముఖం, అక్కడి రైతులను కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేవు. మహబూబాబాద్‌లో జరిగిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటే అక్కడి ప్రజలు ఎంతో సంతోషపడ్డరు. కాంగ్రెస్ ప్రభు త్వం వడ్లు కొనకపోవడంతో వరి కోసి నెల రోజులైనా ఎకడి ధా న్యం అకడే ఉంది. ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివస్‌కు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. నాటి కేసీఆర్ దీక్ష, ఉద్యమ చరిత్ర, తెలంగాణ సాధించిన తీరును వీడియోల రూపంలో ప్రదర్శించి నేటి యువతకు తెలిసేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
– గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భూపాలపల్లి