ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డికే పట్టం
ప్రశ్నించే గొంతుక అయిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికే పట్టభద్రులు పట్టం కట్టబోతున్నారని ఎన్నికల నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి పేర్వాల రవీందర్రావు అన్నారు.
- నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రవీందర్రావు
- చివరి రోజు జోరుగా ప్రచారం
- ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బీఆర్ఎస్ శ్రేణులు
నల్లబెల్లి/నర్సంపేట/ఖానాపురం/నర్సంపేటరూరల్, మే 25: ప్రశ్నించే గొంతుక అయిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికే పట్టభద్రులు పట్టం కట్టబోతున్నారని ఎన్నికల నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి పేర్వాల రవీందర్రావు అన్నారు. నల్లబెల్లి మండలకేంద్రంలో శనివారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాయలంలో ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్రావు మాట్లాడారు.
కేసీఆర్ సర్కారు విద్య, వైద్య రంగాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిందన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సిస్ స్కాలర్షిప్ ద్వారా రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. నేడు మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నదని విమర్శించారు. అలాగే, నర్సంపేట పట్టణంలోని 9, 10, 19 వార్డుల్లో రాకేశ్‌రెడ్డి గెలుపు కోరుతూ బీఆర్ఎస్ నాయకులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గోనె యువరాజ్, రాయుడి దుష్యంత్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.

అంతేకాకుడా ఉన్నత విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఖానాపురం మండలంలోని ఖానాపురం, బుధరావుపేట, అయోధ్యనగర్, దబీర్‌పేట, అశోక్‌నగర్‌లో డాక్టర్ రవీందర్రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రచారం చేశారు. అలాగే, నర్సంపేట మండలంలోని కమ్మపల్లి, ముగ్దుంపురం, గురిజాల, మాదన్నపేట, గుంటూరుపల్లి, రామవరం, లక్నేపల్లి, మహేశ్వరం, ఇటుకాలపల్లి, ముత్తోజిపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని కోరతూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ నేతల ఇంటింటా ప్రచారం
కరీమాబాద్/కాశీబుగ్గ: ఈ నెల 27న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు డివిజన్లలో నాయకులు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేయాలని కోరారు. అలాగే, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను సారంగపాణి 3వ డివిజన్లోని పైడిపల్లిలో పట్టభద్రులకు కరపత్రాలు అందించి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాదాన్యం ఓటెయ్యాలని కోరారు. అలాగే, 14, 19వ డివిజన్లలో పత్రి రాజపోశాలు, కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు.

ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి
శాయంపేట: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని తెలంగాణ జాగృతి యు వత రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ అన్నారు. మండంలోని పెద్దకోడెపాకలో శనివారం పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఇమ్మడిశెట్టి రవీందర్, రవి, అమ్మ రవి, చంద్రమౌళి, వేణు, శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

