మండలి పక్షనేతగా సిరికొండ
బీఆర్ఎస్ శాసన మండలి పక్షనేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం నియమించారు.
- ఎమ్మెల్సీ మధుసూదనాచారిని నియమించిన పార్టీ అధినేత కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శాసన మండలి పక్షనేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం నియమించారు. మధుసూదనాచారి తొలి తెలంగాణ శాసన సభాపతిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన సిరికొండ మధుసూదనాచారి 1982 నుంచి 1997 వరకు తెలుగుదేశం పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా, బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్‌గా సుదీర్ఘ కాలం సేవలందించారు. 1994లో మొదటిసారి శాయంపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఎన్నికై 1999 వరకు కొనసాగారు. 2000 సంవత్సరం నుంచి బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో కలిసి ముందుకు నడిచారు. బీఆర్ఎస్లో కార్యాలయ కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసన సభాపతిగా సేవలందించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2021 డిసెంబర్ 14 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మధుసూదనాచారికి శాసన మండలి పక్షనేతగా కేసీఆర్ అవకాశం కల్పించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

