శాసనమండలిలో గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మహబూబాబాద్, ములుగు జిల్లాల అధ్యక్షులు మాలోత్ కవిత, కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి, బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్‌చేసి, పటాకులు పేల్చి, పండ్లు, స్వీట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల కవిత చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 13