రాయపర్తి : రాష్ట్రంలోని నిరుపేదలందరి సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి ఆమె మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ తో పేదల ఆకలి బాధలు తీర్చడంతోపాటు ఆత్మస్థైర్యం మెరుగవుతుందన్నారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోతు కిషన్ నాయక్, డిప్యూటీ తహసిల్దార్ గంకిడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ కూచన ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి వల్లే వినోద్ కుమార్, నాయకులు జాటోతు హామ్య నాయక్, బిల్ల సుధీర్ రెడ్డి, ఈదులకంటి రవీందర్ రెడ్డి, సరికొండ కృష్ణారెడ్డి, పెండ్లి మహేందర్ రెడ్డి, ఊగ మునిత, కాంచనపల్లి వనజా రాణి, ఇల్లందుల భగవాన్, తదితరులు పాల్గొన్నారు.