నెక్కొండ, జనవరి 2: నెక్కొండకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఈదునూరి రమేశ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్‌రెడ్డి అన్నారు. జాతీయ ఉత్తమ సమాజ సేవకుడి అవా ర్డును ఇటీవలనే పొందిన రమేశ్‌ను నర్సంపేటలో జీబీఎ న్ఎస్పీఎస్ డివిజన్ కన్వీనర్ కల్లెపెల్లి సురేశ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. రమేశ్ సన్మాన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
రమేశ్ విద్యార్థిదశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టున్నారని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నిర్విరామంగా తెలంగాణ సాధనకు కృషిచేసి తనకం టూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు కున్నారన్నారు. భవిష్యత్తులో రమేశ్ సమాజానికి మరెన్నో విలువైన సేవలు అందించాలని కోరుకుంటు న్నానని, తన సహాయ సహకారాలు కలకలాం ఉంటాయన్నారు. తనను ఎంతగా నో ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెలక్ష రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్‌కు, కల్లెపెల్లి సురేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిశెట్టి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, ఎన్జీవో ప్రతినిధులు కోట డేవిడ్, ఎర్ర శ్రీకాంత్, కల్లెపు శోభారాణి, తడుగుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.