గీసుగొండ, ఫిబ్రవరి 3 : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న పరిశ్రమలు తమ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి పార్కును సందర్శించారు. కిటెక్స్ వస్త్ర పరిశ్రమతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. పార్కు నిర్మాణంతో ఈ ప్రాంతంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోశ్, ఎంపీపీ భీమగాని సౌజన్య పాల్గొన్నారు.