ఆత్మకూరు మే 14 : ప్రజల రుణం, కార్యకర్తల కష్టాన్ని మర్చిపోలేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం అగ్రంపాడులోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో దామెర, ఆత్మకూరు మండలాల సంస్థాగత స్థానిక ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే బ్లాక్, మండల, గ్రామ అధ్యక్ష్య పదవులు ఇస్తామన్నారు. అనంతరం టీపీసీసీ అబ్జర్వర్ మక్సుద్ అహ్మద్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.
సమర్థ నాయకత్వం ద్వారానే పార్టీ బలోపేతం అవుతుందని, ప్రజలకు, కార్యకర్తలకు సేవ చేసే నాయకత్వాన్ని ఎంపిక చేయండి అని అన్నారు. గ్రూపులు పెట్టవద్దు అని, కష్టపడ్డా కార్యకర్తకు పార్టీ గుర్తింపు లభిస్తుందని అన్నారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారికి బ్లాక్ అధ్యక్షులు, మండల, వార్డు, గ్రామ అధ్యక్షులను ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, దామెర మండలాల, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.