న్యూశాయంపేట, ఏప్రిల్ 25 : నియోజకవర్గంలో అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం 31వ డివిజన్లోని సూర్జిత్నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, స్ధానిక కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఆయా కాలనీల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు. మంజూరు చేసిన పనులను నిర్ణీత సమయంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులకు త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ను అదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్రావు, శివశంకర్, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.