హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 8: పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ మోదీ మార్క్ పాలన సాగిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 7, 9, 10 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాగన్నదర్వాజ నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ వారసత్వం, విలువలను కాపాడటానికి దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో ఐక్యత సాధించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను,రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అవమానించిందని ఆరోపించారు. భారత దేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కుంటున్నది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ రాజ్యంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ నినాదంతో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్. చీకటి శారద, నెక్కొండ కల్పన, మాజీ కార్పొరేటర్లు నసీం జాహాన్, నాగరాజు, పులి రాజు, అలువల కార్తీక్, బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, మహ్మద్ జాఫర్, ఎస్. కుమార్ యాదవ్, సైండ్ల శ్రీకాంత్, మహ్మద్ నసీర్, హరిసింగ్, బొమ్మతి విక్రం, గుంటి స్వప్న, డి. ప్రణయ్ దీప్, నాగ సోమేశ్వర్, మహ్మద్ ఖుర్షీద్ , మహ్మద్యాకుబ్, బి. రామకృష్ణ, వినయ్, మాడిశెట్టి సతీష్, మంద రాకేశ్, పల్లం రమేష్ , రావుల మధు, ఎల్లయ్య, జావీద్, ఆజాద్ సింగ్, అయేషా నస్రీన పాల్గొన్నారు.