వాజేడు/పాలకుర్తి, జూలై 19: తమకు సెంటు భూమి లేదని, అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని వాజేడు మండలంలోని పెద్దగంగారం గ్రామానికి చెందిన మహిళలు భద్రాచలం ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావును నిలదీశారు. అనర్హులకు మం జూరు చేశారని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఎంపీడీవో శ్రీకాంత్నాయుడును పిలిచి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా చొరవ చూపాలని సూ చించారు.
అర్హత కలిగినా అధికారులు తమకు ఇందిర మ్మ ఇండ్లు మంజురు చేయలేదని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా తనకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యకుంటే కుటంబంతో కలిసి ఆత్మహత్య చేసు కుంటానని పురుగుల మందు డబ్బాతో బమ్మెర గ్రామానికి చెందిన బరిగెల పోతన దంపతులు ఎంపీడీవో కా ర్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
అర్హులైన తమ కు ఇల్లు మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు. తాను కాంగ్రెస్ కార్యకర్తనైనందుకు సిగ్గు పడుతున్నానని వాపోయాడు. మా ఇంటికి కలెక్టర్ వచ్చి ఇల్లు మంజూరైందని చెప్పాడని, దీంతో పాత ఇంటిని కూలగొట్టామ ని బోరున విలపించారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన్యాయం చేస్తానని ఎంపీడీవో రవీందర్ హామీ ఇచ్చా రు. దీంతో పోతన దంపతులు ఆందోళన విరమించారు.