ధర్మసాగర్ : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( MLA Palla Rajeshwar Reddy ) 61వ జన్మదినం సందర్భంగా శనివారం ధర్మసాగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ( BRS ) నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు ( Birthday Celebrations ) నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు బొడ్డు ప్రతాప్ ( Boddu Pratap ) ఆధ్వర్యంలో పీఏసీఎస్ ఛైర్మన్ గుండ్రేడ్డి రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేడుకలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఎమ్మెల్యే పల్లా కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ,భారీ కేక్‌ను కట్ చేసి పండ్లు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం మండలంలోని కరుణాపురంలో ఉన్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేయాలని, ఆయన ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు లాల్ మహ్మద్, జడ్పీ మాజీ కో ఆప్షన్ జుభేదా, నాయకులు మెరుగు రాజిరెడ్డి, మేకల విజయ్, శాతబోయిన రమేశ్, కమలేష్, మామిడల రవీందర్, లవన్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.