జనగామ రూరల్ జూన్ 10 : గ్రామ ప్రజలందరిని అమ్మవారు చల్లగా చూడాలని, తల్లి దయతో వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయం మార్కెట్ మాజీ చైర్మన్లు గాడి పెళ్లి ప్రేమలత రెడ్డి, బాల్దే సిద్ధి లింగం, నాయకులు ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఎలబోయిన కొమురయ్య, వరాల రమేష్ యాదవ్, ఉల్లెంగుల సందీప్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.