హనుమకొండ, అక్టోబర్ 13: జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) బాక్సింగ్ హాల్లో 69వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల బాక్సింగ్ పోటీలు ముగిశాయి. మెడల్స్ ప్రదానోత్సవం ఎస్జిఎఫ్ హనుమకొండ సెక్రటరీ వి.ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మెడల్స్‌ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదప డతాయన్నారు. క్రీడలకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, జక్కుల రవి, ఎం. స్వామి చరణ్ టిజి పేట జిల్లా అధ్యక్షులు ఎస్ పార్థసారథి, పేట టిఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.ప్రభాకర్‌రెడ్డి, డి.కుమారస్వామి, అండర్ 19 సెక్రెటరీ ఎన్.శ్రీధర్, భూపాలపల్లి డివైఎస్వో సిహెచ్.రఘు, టిజీపేట స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బి.సుధాకర్, పిడిలు ఆర్.సుభాష్, సిహెచ్. వెంకటేశ్వర్లు, ఎంఎం కరుణాకర్, మనోహర్, రాజేశ్వర్, మోహన్, లక్ష్మీనారాయణ, రెబెకా పాల్గొన్నారు.