పోచమ్మమైదాన్, అక్టోబర్ అపార్ట్మెంట్ వాసులందరికీ తాను అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. పోచమ్మమైదాన్‌లోని ఏఎన్ఆర్ అపార్ట్‌మెంట్‌వాసులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్లలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశానని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని తెలిపారు. పలు డివిజన్లలో మౌలిక సదుపాయాలతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి.రమేశ్‌బాబు, యెలుగం సత్యనారాయణ, అపార్ట్మెంట్ అధ్యక్షుడు రవికుమార్, ఆనంద్‌రావు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్‌వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా నరేందర్‌ను గెలిపించుకుంటామని తెలిపారు.
తూర్పు ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌ను రెండోసారి గెలిపించుకుంటామని 22వ డివిజన్ సూర్జీత్నగర్ కాలనీవాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్యే నరేందర్ కాలనీని మంగళవారం సందర్శించినప్పుడు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. కాలనీలో సమస్యలను పరిష్కరిస్తున్న నరేందర్ సార్‌కు ఓట్లు వేసి గెలిపించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో ఇప్పటికే మౌలిక సమస్యలను చాలావరకు పరిష్కారం చేశానని, మిగతావి కూడా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అధిక మెజారిటీతో గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను సోమవారం రాత్రి ఓ సిటీలోని క్యాంప్ ఆఫీస్‌లో శివనగర్ పెరిక పరపతి సంఘం, ఆర్ఎంపీ, పీఎంపీలు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిసి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ సంపూర్ణ మద్దతు వుపకటించారు. పెరిక సంఘం నూతన కార్యవర్గం తనకు మద్దతు పలకడం సంతోషంగా ఉందని, పెరిక సంఘం సభ్యులకు జీవితకాలం రుణపడి ఉంటానని, వేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.