కాశీబుగ్గ, మే 23: సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు. ఓసిటీ మైదానంలో బీఆర్ఎస్ 18, 19, 27వ డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం కార్పొరేటర్ ఓని స్వర్ణలత అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పక్క రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రతి కార్యకర్త గడపగడపకు తిరిగి తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తూర్పు నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకే హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మోడల్ బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. వరంగల్ కలెక్టరేట్ నిర్మాణంతో పేదల ఇంటి స్థలాల విలువ పెద్ద ఎత్తున పెరిగిపోతుందని వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు గీసుగొండ-సంగెం మండలాల పరిధిలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సమ్మేళనంలో కార్పొరేటర్లు చింతాకుల అనిల్, వస్కుల బాబు, దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, నాయకులు గోపాల నవీన్‌రాజ్, చింతాకుల సునీల్, దుబ్బ శ్రీనివాస్, టీ రమేశ్‌బాబు, జోగు చంద్రశేఖర్, గోరంటల మనోహర్, వేముల నాగరాజు, క్యాతం రంజిత్, సిలువేరు పవన్, జక్కం దాసు, జక్కం ప్రవీణ్, పోలెపాక యాకయ్య పాల్గొన్నారు.