గిర్మాజీపేట, జూలై 16 : తెలంగాణ రైతుల ఊపిరి సీఎం కేసీఆర్ అని, అన్నదాతలు ముఖ్యమంత్రికి అండగా నిలువాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖిలావరంగల్‌లో నిర్వహించిన రైతుల సమావేశానికి ఆయన చమన్సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా.. ఆ తర్వాత ఎండ్ల బండిపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నదాతలతో కలిసి వ్యవసాయ క్షేత్రాల్లో ఫ్లకార్డులు చేతబూని జై తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం కార్పొరేటర్ బోగి సువ ర్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నన్నపునేని మాట్లాడుతూ రైతన్నలకు వెన్నెముకగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ మూడు పంటలు పండించుకునేలా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మూడు గంటల కరంటు చాలు అంటున్న కాంగ్రె స్ పార్టీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి నేడు వ్యవసాయాన్ని, రైతన్నలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రైతు ద్రోహులను ప్రజల్లో తిరగనివ్వకుండా చేయాలని, అందుకు అన్నదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ కుట్రపూరిత ఆలోచనలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం అందించాలి
రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకు డు సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల ని ర్మాణం, రుణమాఫీ వంటి అనేక పథకాలు, భద్ర త కల్పిస్తున్నారని కొనియాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాత్రివేళల్లో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే క్రమంలో విషపురుగుల బారిన పడి అనేక మంది రైతులు మరణించిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. అనంతరం ఖిలావరంగల్ పడమరకోట అర్బన్‌హెల్త్ సెంటర్ నుంచి గంగాదేవిగండి వరకు రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, జడ్ఆర్సీసీ మెంబర్ చింతాకుల సునీల్, బీఆర్ఎస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్, పీఏసీఎస్ డైరెక్టర్లు నర్సయ్య, శ్రవణ్, విజయ్, అభిషేక్, చందర్, రాంబాబు, ఉల్ఫాత్, రాజారాం, భిక్షపతి, కరుణాకర్, అమర్, రైతులు రాజేశ్, చిన్నయ్య, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, రవి, చందు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తర్వాత 28వ డివిజన్లోని తన మిత్రుడైన ఎన్నారై రాజు గృహప్రవేశానికి ఎమ్మెల్యే నరేందర్-వాణి దంపతులు హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత గందె నవీన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.