మడికొండ : గ్రేటర్ 64వ డివిజన్ మడికొండకు చెందిన దువ్వ గణేష్ చెవి సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ దవాఖానలో చేర్పించారు. చికిత్స చేయించడం కోసం కావాల్సిన డబ్బులు లేకపోవడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో రూ.3.50 లక్షలు విలువచేసే ఎల్ఓసి చెక్కును బాధితుడి తల్లిదండ్రులు లలిత, శ్రీనివాసులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆయన వెంట మెట్టుగుట్మూట చైర్మన్ పైడిపాల రఘుచందర్, డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, వస్కుల నాగరాజు, బైరి లింగమూర్తి తదితరులు ఉన్నారు.