కరీమాబాద్, సెప్టెంబర్ 24: ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, తెలంగాణ ఉద్యమంలో కళాకారులది కీలక పాత్ర అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళాభవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళా భవనాన్ని నిర్మించి కళాకారుల కల నెరవేర్చిందన్నారు. కళాకారులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, తెలంగాణలోనే కళాకారులకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారంతో ఉర్సు చెరువు సమీపంలో కల్చరల్ ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. ఎస్కే గౌడ్ కళాక్షేత్రంగా కళాభవనానికి నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ రవి, డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్‌కుమార్, వనం కుమార్, ఓరుగల్లు కళాపరిషత్ అధ్యక్షుడు యేర కోటేశ్వర్, ఉపాధ్యక్షులు ఆకుతోట లక్ష్మణ్, రాసమల్ల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి కాజీపేట తిరుమలయ్య, సహాయ కార్యదర్శి రాయిశెట్టి విద్యాసాగర్, కోశాధికారి సోల్తి బాలాజీ, కార్యనిర్వాహక సభ్యులు సోల్తి సదానందం, నామని ఓం ప్రకాశ్, నగిరెకంటి సదానందం, పొగాకు దిలీప్‌కుమార్, సాదుల సురేశ్, ముఖ్య సలహాదారులు సోల్తి వెంకటలక్ష్మి, బౌరిశెట్టి తులసీదాస్, నాగపురి వెంకటస్వామి పాల్గొన్నారు.
కుల వృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత
సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తూ భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. ఆదివారం ఉర్సు చెరువు, బెస్తం చెరువుల్లో ప్రభుత్వం అందిస్తున్న చేపపిల్లలను వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ, ఆర్థికాభివృద్ధి సాధించేలా పథకాలను అమలు చేస్తోందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి, ధోబీఘాట్‌ను పరిశీలించారు. ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్, నాయకులు కోరె కృష్ణ, బైరి నాగరాజు, వంగరి సురేశ్ పాల్గొన్నారు.