ఐనవోలు, జనవరి 9 : ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు ఆహ్వానించారు. ఈ నెల 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను వారు కలిసి ఐనవోలు మల్లన్న స్వామి చిత్రపటం, ఆహ్వాన పత్రం అందజేసి రావాలని ఆహ్వానించారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే అరూరి తెలిపారు. అదేవిధంగా ఆలయ శాశ్వత అభివృద్ధిలో భాగంగా తయారు చేయించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ సీఎం కేసీఆర్‌కు అందజేసి, ఆలయాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలోఅర్చకులు స్వామి వారి లడూప్రసాదాలు అందజేసిన వేదమంత్రోచ్ఛరణతో సీఎంను ఆశీర్వదించారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్‌శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్‌జోషి, జూనియర్ అసిస్టెంట్ అద్దంకి కిరణ్‌కుమార్, సిబ్బంది తాళ్లపల్లి శ్రీకాంత్ ఉన్నారు.