కృష్ణ కాలనీ, డిసెంబర్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఓ వైపు మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలి తాగు నీరు వృథా పోతుండగా, మరో వైపు సుభాష్, కారల్‌మార్స్, పైలట్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంచి నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ నెట్వర్క్ కేబుల్ వేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు గుంత తీస్తుండగా మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది.
దీంతో నీరంతా వృథాగా పోతూ కేటీకే-5 ఇంకె్లైన్ వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి నూతనంగా నిర్మిస్తున్న ఇంటలిజెన్స్ పోలీస్ విభాగం జిల్లా కార్యాలయం చుట్టూ పెద్ద ఎత్తున చేరింది. అసలే గత నాలుగు రోజులుగా కాలనీల్లో తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే వచ్చే మిషన్ భగీరథ నీళ్లు వృథాగా రోడ్లపై ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో కాలనీవాసులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనులు వెంటనే చేపట్టి మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోకుండా చూడాలని పట్ట ణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా పైపులైన్ లీకేజీతో మున్సిపాలిటీకి ఎలాం టి సంబంధం లేదని, మిషన్ భగీరథ అధికారులే చూసుకోవాలని తెలిపారు.